రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అచ్చంపేట గడ్డపై బీజేపీ జెండా ఎగరేస్తామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చావు తప్పి కన్నులోట్టబోయినట్టు గెలిసిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రమంతా గెలుస్తామని భ్రమలో ఉన్నారు అని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు అని అన్నారు.
గత ఎన్నికల్లో అబద్ధపు హామీలతో గద్దె ఎక్కిన రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు అని ఆయన మండిపడ్డారు. 42శాతం రిజర్వేషన్ చెప్పి పార్టీ పరంగా మేము 42శాతం రిజర్వేషన్ ఇస్తామని పనికిరాని మాటలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నాడని గ్రామం నుండి రాష్ట్రం వరకు సోదరి, సోదర మనులందరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని గువ్వల బాలరాజ్ అన్నారు. ఐక్యతను చాటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తే ఉంటే దేశమంతా విశ్వసిస్తా ఉంది అందుకు నిదర్శనం బీహార్ ఎన్నికాలే అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు ఎప్పుడు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన టైం ఆసన్నమైంది గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు నిలబడ్డా ఆరు గ్యారెంటీలు 420 హామీలపై నిలదీయాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే అభ్యర్థిని గ్రామస్తులు గెలిపించుకోవాలని సూచించారు రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాషాయం జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మంగ నాయక్, బాలాజీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

