Tuesday, July 21, 2026
Homeరాజకీయాలురోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అఖిలపక్షం ధర్నా

రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అఖిలపక్షం ధర్నా

తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తిమ్మాపూర్ నుంచి పోరండ్ల వరకు సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం రోజున తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమింప చేశారు.

అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిమ్మాపూర్ రాజీవ్ రహదారి నుండి పోరండ్ల గ్రామం వరకు సిమెంటు రోడ్డును రెండు కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిన గాని పనులు ప్రారంభించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. గ్రామాల్లో కూరగాయలు పండించే రైతులకు మరియు ఆటో డ్రైవర్లకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

అనంతరం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఏకానందం, బిజెపి మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వర చారి, తెలంగాణ జాగృతి మండల నాయకులు బుడిగే పరుశురాం గౌడ్, వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు