Wednesday, July 22, 2026
Homeవార్తలువైభవంగా ‘ఇందిరమ్మ గృహ’ ప్రవేశం

వైభవంగా ‘ఇందిరమ్మ గృహ’ ప్రవేశం

TG: వేములవాడ పట్టణానికి చెందిన రామతీర్థపు పద్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని సోమవారం గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త బట్టలు అందించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సహకారంతో సొంతింటి కల సాకారమైందని లబ్ధిదారు పద్మ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్‌ గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు కనికరపు రాకేష్‌, పుల్కం రాజు, ఇప్పపుల అజయ్‌, మైలారం రాము, చిలక రమేష్‌, ముప్పిడి శ్రీధర్‌ పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు