Tuesday, July 21, 2026
Homeక్రీడలుఆసుపత్రిలో చేరిన టీమిండియా కెప్టెన్ గిల్

ఆసుపత్రిలో చేరిన టీమిండియా కెప్టెన్ గిల్

టీమిండియా కెప్టెన్ గిల్ ఆసుపత్రిలో చేరాడు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా వర్సెస్ భార‌త్‌ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ సందర్భంగా మెడనొప్పి బారిన పడ్డాడు గిల్. దీంతో 4 పరుగుల వద్దే రిటైర్డ్ ఔట్ అయ్యాడు. గిల్‌ మెడ నొప్పి తీవ్రతరం అయినట్లు తెలుస్తోంది. దీంతో గిల్ ను ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆస్పత్రిలోనే గిల్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గిల్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.ఇది ఇలా ఉండగా గిల్ మధ్యలో వెళ్లిపోవడంతో రిషబ్ పంత్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

Related News

తాజా వార్తలు