Tuesday, July 21, 2026
Homeవార్తలుడ్రగ్ రాకెట్ కేసు.. వారికి బాలీవుడ్‌ బ్యూటీ వార్నింగ్‌!

డ్రగ్ రాకెట్ కేసు.. వారికి బాలీవుడ్‌ బ్యూటీ వార్నింగ్‌!

డ్రగ్ రాకెట్‌తో బాలీవుడ్ నటీనటులకు సంబంధం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో తన పేరు ఉండటంపై నోరా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చింది.

నేను పార్టీలకు వెళ్లను నా పనిలోనే బిజీగా ఉంటాను. నాకు వ్యక్తిగత జీవితం కూడా లేదు. అలాంటి వారితో నేను ఎప్పుడూ మింగిల్ అవ్వలేదు అవ్వను కూడా. దుబాయ్‌కి వెళితే నా హైస్కూల్ ఫ్రెండ్స్‌తో గడుపుతాను. కావాలనే నా పేరుని ఇందులోకి లాగుతున్నారు. కానీ ఈసారి అలా జరగనివ్వను. నాపై తప్పుడు ఆలోచనలు చేస్తే భారీ ధర చెల్లించాల్సి వస్తుంది” అని హెచ్చరించింది.

Related News

తాజా వార్తలు