TG:మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించనున్న 50 పడకల ఆస్ఫత్రి నిర్మాణం పనులకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగల ఆరు పడకల స్థాయిని 50 పడకలకు పెంచేందుకు చేసిన కృషి ఫలితంగానే 17.50 కోట్ల మంజూరైనట్టు చెప్పారు. నిర్దేశిత గడువులోగా ఆస్పత్రిని నిర్మించుకోగలిగితే ప్రజలు సత్వరమే మెరుగైన వైద్య సేవలు పొందగలుగుతారని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుతోందన్నారు.

