TG:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ఎమ్మెల్యే విజయరమణ రావుతో కలిసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి అండతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ పెరిగిందని, ఈ దెబ్బతో బిఆర్ఎస్ పార్టీ పని ఖతం అని అన్నారు. సానుభూతికి తావు లేకుండా పోయి, ప్రజా ప్రభుత్వం గెలిచిందని స్పష్టం చేశారు.

