TG:”నీల్ బత్తె సన్నాట” సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని సాధించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు నిచ్చారు.పనిమనిషి కష్టపడుతూ తన కూతుర్ని ఐఏఎస్ వరకు చదివిస్తుందన్నారు. సహజంగా డాక్టర్ కూతురు డాక్టరు, ఇంజనీరు కూతురు ఇంజనీర్ అవుతారు. కానీ, పనిమనిషి కూతురు ఐఏఎస్ వరకు చదివించడం అధ్బుతమనీ, లక్ష్య సాధనకు ఈ సినిమా ప్రేరణగా నిలుస్తుందన్నారు. కరీంనగర్ ఫిలిం భవన్ లో ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఫెస్టివల్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సినిమాలో కూతుర్ని చదివించేందుకు ఒక తల్లి పడి కష్టం, చదువు రాని తల్లి తన కూతురితో పదో తరగతి వరకు చదువుతుందన్నారు. ఈ సినిమాను విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ చూడాలని కోరారు. చిన్నప్పటినుంచి విద్యార్థులు సంస్కారం అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. చిన్నప్పటినుంచే లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పరీక్ష ఉంటుందని వాటిని అధిగమించుకుంటూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల ఎదుగుదల కోసం నిరంతరం కష్టపడుతుంటారని వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.
అంతకుముందుకు కలెక్టర్ పమేలా సత్పతిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆలపించిన చిన్నారి పిచ్చుక వీడియో ప్రదర్శనతో పాటు పంచతంత్ర బాలల చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భగవతి స్కూల్ విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారు.

