Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుజూబ్లీహిల్స్ విజయంలో ఆ ఎమ్మెల్యే కీల‌క‌పాత్ర

జూబ్లీహిల్స్ విజయంలో ఆ ఎమ్మెల్యే కీల‌క‌పాత్ర

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంతో రాష్ట్రం అంతటా సంబరాలు జోరందుకున్నాయి. జూబ్లీహిల్స్ గడ్డ సీఎం రేవంత్ రెడ్డి అడ్డ అని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కార్యకర్తలు అంబరాన్నంటిన ఆనందోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బోరబండ డివిజన్ ఇంచార్జ్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,యూసఫ్‌గూడా డివిజన్ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి,కార్పొరేషన్ చైర్మన్‌లు అభినందించారు.

25 రోజులుగా పార్టీ పిలుపు మేరకు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఒకరు బోరబండ డివిజన్,మరొకరు యూసఫ్‌గూడా డివిజన్లో నవీన్ యాదవ్ గెలుపు కోసం తమదైన శైలిలో ప్రచారం చేప‌ట్టారు.జూబ్లీహిల్స్‌లో విజయం నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జ‌రుపుకున్నారు.

Related News

తాజా వార్తలు