Tuesday, July 21, 2026
Homeరాజకీయాలునవీన్ యాదవ్ గెలుపుపై సంబరాలు

నవీన్ యాదవ్ గెలుపుపై సంబరాలు

TG:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడం పట్ల గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మేరా రవీందర్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధికి ఈ విజయం నిదర్శనం అని అన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి పాలనను కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పడానికి ఈ ఎన్నిక ఫలితాలు నిదర్శనం అని అన్నారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపుని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

Related News

తాజా వార్తలు