కరీంనగర్: గన్నేరువరం మండల నూతన ఎమ్మార్వోగా హుజూరాబాద్ మండలం నుంచి బదిలీపై వచ్చిన కోడెం కనకయ్య బాధ్యతలు స్వీకరించారు. రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు బోడ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ఎమ్మార్వోను బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఇక్కడ పని చేసిన ఎమ్మార్వో నరేందర్ హుజూరాబాద్ కు బదిలీపై వెళ్లారు. సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రణయ్, ఆర్ ఐ ప్రవీణ్, ఆర్ ఐ రఘు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనాథ్, రమేష్, జంగాపల్లి డీలర్ ఆంజనేయులు పాల్గొన్నారు.

