కరీంనగర్: నవంబర్ 26న జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంపీడీవో ఏ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. 1949, నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోదం లభించిందని, ఆ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశంలో సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం)ను జరుపుకొంటారని చెప్పారు. 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిందని వివరించారు.

