TG : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ మంగళవారం దర్శించుకున్నారు. కోడెముక్కలు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో ఎల్. రమాదేవి అతిథులకు శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు.
అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన కోడె క్యూ లైన్లు, ఉచిత దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనం, అభిషేకం లైన్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

