Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుమహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బోయిని నరేష్ తెలిపారు.సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బోయిని నరేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు.మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నరేష్ కోరారు.18సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వం చిరెను అందిస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని వారు కోరారు.మండలంలోని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో చీరల పంపిణీ జరుగుతుందని,అర్హులైన ప్రతి మహిళ ఇంటి వద్దకే వచ్చి బొట్టు పెట్టి చీరను అందిస్తారని మహిళలకు తెలిపారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున రుణపడి ఉంటామని చెబుతున్నారని నరేష్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రేకొండ గ్రామ శాఖ అధ్యక్షులు గదేపాక సునీల్, పార్టీ గ్రామశాఖ కార్యదర్శి పిట్టల వెంకటరాజం,బూత్ అధ్యక్షులు రొంటాల లావణ్య,దొడ్ల రమణారెడ్డి,చంచల ప్రభాకర్,వివిధ శాఖల అధికారులు,మహిళా సంఘాల సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు