Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుతెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీ చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీ చేరికలు

TG: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం అవుతున్న క్రమంలో పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం ఆ పార్టీలోకి భారీగా చేరికలు నమోదయ్యాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,బీసీ ఉద్యమ నాయకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్‌పీలో చేరారు.

టీఆర్‌పీలో చేరిన కొత్త సభ్యులను పార్టీ సీనియర్ నాయకులు గుండేవేన స్వామి,జిల్లా అధ్యక్షులు కాసిపేట్ ఉదయ్,ప్రధాన కార్యదర్శి చల్ల సాయికృష్ణ పటేల్ సాదరంగా ఆహ్వానించారు.వారికి పార్టీ కండువాలు కప్పి,క్రియాశీలక సభ్యులుగా గుర్తింపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలకు,మల్లన్న పోరాటానికి ఆకర్షితులై అనేకమంది యువకులు, ప్రజాభిమానం ఉన్న నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు.పార్టీ విస్తరణలో భాగంగా,చేరిన పలువురు నూతన కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించారు.వారిలో కొందరిని తక్షణమే సోషల్ మీడియా మండలం కన్వీనర్‌గా నియమించినట్లు జిల్లా నాయకత్వం ప్రకటించింది.

సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను,పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.జిల్లా అధ్యక్షులు కాసిపేట్ ఉదయ్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా అందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.మల్లన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని,నిస్వార్థ సేవతోనే ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అడ్లూరి గంగారాం తో పాటు పెద్ద సంఖ్యలో మండల,గ్రామ స్థాయి కార్యకర్తలు,కొత్తగా చేరిన నాయకులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు