TG:జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజన్న సిరిసిల్లా జిల్లా ఇంచార్జ్, మేడి అంజయ్య
రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ 26న హలో మాల-చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాతీయ మాల మహానాడు రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు నీరటిశ్రీనివాస్ అన్నారు. మాలల ఐక్యవేదిక అధ్యక్షులు తుంగ శివరాజ్ ఉపాధ్యక్షులు, జక్కుల యాదగిరి సోమవారం కోనరావుపేట మండల అధ్యక్షులు, మందాల శ్రీనివాస్, ఆధ్వర్యంలో మండల, కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో హలో మాల-చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల-చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26 న నిర్వహించడం జరుగుతుందన్నారు. మాలలపై జరుగుతున్న అక్రమాలను నిలదీస్తూ ,రాజ్యాంగ విరుద్ధంగా జీవో 99 రోస్టర్ విధానాన్ని తిరిగి పునః సమీక్షించాలని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ 15 నుంచి 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.

