Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బెజ్జంకి: మండలంలోని సత్యార్జున ఫంక్షన్ హాల్లో మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి ఇందిరమ్మ మహిళా శక్తి చీరెలను శనివారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య ఉద్దేశమని, ఆందుకు అనుగుణంగా ప్రభుత్వం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళల పేరుతో ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంఘాల ద్వారా రెండు లక్షల రుణాలు ఇస్తున్నట్టు చెప్పారు. మంచి నాణ్యత, మంచి కలర్లతో మహిళలతో నేయించిన చీరెలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 14 మందికి ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డీపీఎం విద్యాసాగర్, ఎమ్మార్వో శ్రీకాంత్, ఎంపీడీవో కడవేర్గు ప్రవీణ్, ఏపీఎం పరశురాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కిస రత్నాకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష,్ణ వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు, బీసీ సెల్ అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, యూత్ అధ్యక్షుడు కర్రల సందీప్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల మహిళలు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు