Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుఈ దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి: కేటీఆర్

ఈ దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి: కేటీఆర్

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటలు కాకముందే కాంగ్రెస్ పార్టీ గూండాయిజానికి, రౌడీయిజానికి దిగిందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. శుక్ర‌వారం రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రెహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన బీఆర్‌ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ ను ఆయన పరామర్శించారు. తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ పోటీ చేసిన ఎన్నికల్లో, అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ కూడా చేష్టలు ఉడిగి చూసిన వైనం ఫలితంగానే మేము సాంకేతికంగా ఓడిపోయమని కేటీఆర్ వివరించారు.

కాంగ్రెస్ పార్టీ చర్యలను ఖందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. పదేళ్ల బీ ఆర్ ఎస్ పాలనలో ప్రతిపక్షం పై దాడులు జగిగాయా అన్నారు. మా కార్యకర్తలు హద్దులు దాటి దాడిలా చేశారా అని నిలదీశారు. ఉప ఎన్నికల్లో గెలిచిన వెంటనే, కాంగ్రెస్ వాళ్ళు కారును ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించారని స్పష్టం చేశారు. గతంలో ఏడు ఉప ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచినప్పుడు మేము ఎప్పుడైనా ఇలా ప్రవర్తించామా? అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే, గతంలో పదేళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎలా ప్రవర్తించి ఉండాలో ఆలోచించుకోండని సూచించారు.

సీఎం రేవంత్, కాంగ్రెస్ బాధ్యత-కేటీఆర్
రాకేష్ క్రిస్టోఫర్, ఒక క్రిస్టియన్ మైనారిటీ సోదరుడని తన పై జరిగిన దాడిని ఖండించారు.ఈ దాడికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ,సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రకంగా కక్షపూరితంగా, రౌడీయిజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని,తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, సునీత, కౌశిక్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు బాధితుంది కుటుంబానికి ధైర్యం చెప్పారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తకి ఏం జరిగినా, కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత తనది, పార్టీది అని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Related News

తాజా వార్తలు