కమాన్ పూర్: లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు, నేత్రవైద్య సహాయకులు పూదరి దత్తాగౌడ్ ఆధ్వర్యంలో కమాన్ పూర్ కు చెందినవారికి ఉచిత కంటి శుక్లo శస్త్ర చికిత్సలు చేపట్టారు. కరీంనగర్ లోని చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించారు.వీరికి ఉచిత రవాణా భోజన వసతులు కల్పించారు.
ఈ సందర్భంగా ఉచిత ఫాకో శస్త్ర చికిత్సలకు సహకరించిన చల్మెడ ఆనందరావు ఆసుపత్రి నేత్రవైద్య విభాగాధిపతి డా.రఘుకు కృతజ్ఞతలు తెలియజేశారు.డా.రఘు మాట్లాడుతూ.. ఫాకో శస్త్ర చికిత్సలు చేసుకున్నవారు పది రోజుల్లో రోజువారి కార్యకలాపాలను ప్రారంభించవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు మగ్గిడి శ్రీలత,దేవి మల్లీశ్వరి పాల్గొన్నారు.

