Tuesday, July 21, 2026
Homeవార్తలుప్రభుత్వ పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాలు

ప్రభుత్వ పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాలు

కమాన్ పూర్: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారిచే మూఢనమ్మకాలను నిర్మూలించడంలో భాగంగా చెకుముకి సైన్స్‌ సంబరాలు 2025 మండల స్థాయిలో పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలలు కమాన్ పూర్, రొంపి కుంట, జూలపల్లి, ప్రాథమికోన్నత పాఠశాల నాగారం నుండి విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ పోటీలలో గెలుపొందిన కమాన్ పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, నజీఫా, చరిష్మా, అంజుమ్ సుల్తానాలకు మండల విద్యాధికారి ఇల్లందుల విజయ్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు. మండల విద్యాధికారి మాట్లాడుతూ.. ఈనెల 28న పెద్దపల్లిలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు వీరిని పంపించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సైన్సు బోధించే ఉపాధ్యాయులు రాజేశ్వరరావు, పడాల సతీష్, రజిత కుమారి, శంకర్, శ్రీనివాస్, మల్లేష్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు