Wednesday, July 22, 2026
Homeవార్తలుఅన్నదానం మహాదానం..భారీగా భక్తులు

అన్నదానం మహాదానం..భారీగా భక్తులు

కోరుట్ల:’సనాతన ధర్మ ప్రచార సమితి’ ఆధ్వర్యంలో ‘అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద సేవ’లో భాగంగా బుధవారం అన్నదానం జరిగింది. కార్తీక అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని కోరుట్ల అంగడి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ఎదురుగా ఐబి రోడ్డులో అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు.
మొదట అన్నపూర్ణ మాతకు, గోమాతకు పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 1500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేకతగా పర్యావరణ హిత దృక్పథంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడటం జరిగింది. కార్యక్రమానికి సుమారు 250 మంది సభ్యులు సమిష్టి సహకారం అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. “ప్రతీ అమావాస్య రోజున పట్టణంలోని వివిధ కూడళ్లలో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుందని, ఈ సత్కార్యం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభించి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాం” అని పేర్కొన్నారు. “అన్నదానం మహాదానం” అనే సూత్రాన్ని ఆచరణలో పెడుతూ, భక్తి, సేవా భావం, పర్యావరణ పరిరక్షణల లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, అన్నపూర్ణ అన్నప్రసాద సేవ చైర్మన్ వనపర్తి చంద్రమోహన్, కన్వీనర్ గంప శివకుమార్, నిర్వాహకులు మంచాల రమేష్, పల్లెర్ల మహేందర్, కట్కం రంజిత్, సాడిగే మహేష్, ఎలిమి బుచ్చన్న, మంచాల రాజలింగం, రాచమడుగు శ్రీనివాసరావు, శ్రీపతి రమేష్, మరియు సేవలో భాగంగా కట్కం సునీత, పడాల లత, వడ్లకొండ జయశ్రీ, బోగ సత్తెమ్మ, కూరగాయల శేఖర్, వడ్లకొండ అశోక్, దొంతుల రమేష్, దాసరి నరేష్, ఎలిమి శంకర్, తాటికొండ కృష్ణప్రహ్లాద్, కొత్త గణేష్, యాంసాని శంకర్, లోకేష్, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు