Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుకవితక్క అరెస్టు దుర్మార్గం

కవితక్క అరెస్టు దుర్మార్గం

కరీంనగర్‌: ఎన్నికల ముందు సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయిందని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని సింగరేణి భవన్‌ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను అరెస్టు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శమని తెలంగాణ జాగృతి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌ మండిపడ్డారు. సింగరేణి మెడికల్‌ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి కార్మికులకు న్యాయం చేయాలని, అలియాస్‌ కార్మికులకు అవకాశం ఇవ్వాలని, సొంతంటి పథకం కచ్చితంగా అమలు చేయాలని, ఐటీ నిహాయింపు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క సింగరేణి కార్మికుల పక్షాన పోరాటానికి సిద్ధపడి బుధవారం సింగరేణి భవన్‌ ముట్టడించినట్టు తెలిపారు.

కానీ ప్రభుత్వం పోలీసులను ఆడ్డం పెట్టుకోని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపడం కోసం కవితక్క సింగరేణి కార్మికులను కలుపుకొని సింగరేణి భవన్‌ను ముట్టడిస్తే అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం రాత్రి నుంచే సింగరేణి ఏరియాలో వందల సంఖ్యలో జాగృతి, హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించాడన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వం సింగరేణి కార్మికుల ఇబ్బందులను, వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి జాగృతి, హెచ్‌ఎంఎస్‌ నాయకులను అరెస్టు చేయడం సర్కారు పిరికి తనానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. జాగృతి నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన ఈ పోరాటం ఆగుతుందనుకుంటే అది ప్రభుత్వ మూర్ఖత్వామే అవుతుందని స్పష్టంచేశారు. కవితక్క అరెస్ట్‌లకు భయపడే నాయకురాలు కాదని, కార్మికులకు న్యాయం జరిగే వరకు కవితక్క ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

Related News

తాజా వార్తలు