Wednesday, July 22, 2026
Homeవార్తలువైద్యుల నిర్లక్ష్యం.. బాలుడు మృతి

వైద్యుల నిర్లక్ష్యం.. బాలుడు మృతి

కోరుట్ల పట్టణంలో వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స పొందుతూ ఒక బాలుడు మృతి చెందాడంటూ ప్రవేట్ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన వేదన్ష్ (5) అనే బాలుడు అనారోగ్యంతో కోరుట్లలోని మమత హాస్పిటల్‌లో చేరారు.

అయితే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందాడని, మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

తాజా వార్తలు