TG:రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వ నిర్ణయించింది. రాష్ట్రంలో మరోసారి క్యాబినెట్ విస్తరణ చేపట్టేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, తమ మార్కును చాటారు.తాజాగా ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ కు మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. అందులో భాగంగా ఆయన గెలిచిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా తనను తీసుకువెళ్లి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ చేపడితే హైదరాబాద్ నుండి గెలిచిన నవీన్ యాదవ్ కు మంత్రి పదవి దక్కుతుంది అని సమాచారం.
ఇప్పటికే ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ కు మంత్రి పదవిని కట్టబెట్టారు కాంగ్రెస్ నాయకులు. తాజాగా నవీన్ యాదవ్ కు మంత్రి పదవి అందిస్తే గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమై స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందులో భాగంగా ఆయనకు మంత్రి పదవి కట్టబట్టేందుకు కాంగ్రెస్ నాయకులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నికలకు ముందే నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి పదవి తప్పదు అన్న వాదనలు పెద్ద ఎత్తున తెరమీదికి వచ్చాయి. తాజాగా ఆయన గెలిచి గెలుపుతో మంత్రి పదవి వరిస్తుంది అని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. నవీన్ యాదవ్ ఆశలను కాంగ్రెస్ నాయకులు సహకారం చేస్తారా లేదా అడి ఆశాలు చేస్తారా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ
మంత్రివర్గ విస్తరణలో బీసీ నినాదం మరోసారి తెరమీదకి రానుంది. ఇప్పటికే 42 శాతం బీసీలకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఇది అంశంపై కోర్టు సమస్యలు ఎదురు కావడంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏ విధంగా ముందుకు సాగుతారు అన్న విషయంపై మంత్రివర్గం పూర్తిస్థాయిలో చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీసీ వాదాన్ని కాంగ్రెస్ పార్టీ తరిమీదికి తీసుకువచ్చి రాష్ట్ర అధ్యక్షుని సైతం బీసీని నియమించింది. టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమించిన తరువాత అన్నీ కలిసి వచ్చినట్లే కనిపిస్తున్నాయి.
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిసి అభ్యర్థికి అవకాశం కల్పించి విజయం సాధించింది. దీనితో కాంగ్రెస్ పార్టీకి బీసీ వాదం కలిసి వచ్చింది అని చెప్పక తప్పదు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీ వాదం కలిసొస్తుందన నమ్మకం కనిపిస్తోంది. దీనితో ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

