Tuesday, July 21, 2026
Homeక్రీడలుఆసియా ఆర్చరీలో భారత్‌కు స్వర్ణాల పంట

ఆసియా ఆర్చరీలో భారత్‌కు స్వర్ణాల పంట

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో మెరిశారు. టోర్నీలో భారత్ మొత్తం 10 పతకాలతో (6 స్వర్ణాలు) పతకాల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది.

విజయవాడకు చెందిన తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, పురుషుల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో సహచరుడు రాహుల్‌ను 6-2 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ సాధించి ఆసియా చాంపియన్‌గా అవతరించాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో అంకిత భట్ 7-3 తేడాతో సౌత్ కొరియా ఒలింపిక్ పతక విజేతను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో కూడా భారత్‌కే గోల్డ్ దక్కింది.ఇక గురువారం తెలుగు తేజం వెన్నెం జ్యోతి సురేఖ రెండు గోల్డ్‌ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే.

Related News

తాజా వార్తలు