Tuesday, July 21, 2026
Homeవార్తలుఆకట్టుకునేలా కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ట్రైలర్

ఆకట్టుకునేలా కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ట్రైలర్

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం రివాల్వర్ రీటా. ఈ సినిమాను కేకే చంద్రు తెర‌కెక్కించారు. ఈ రివాల్వర్ రీటా సినిమాలో రాధిక శరత్ కుమార్, అజయ్ ఘోష్, సునీల్ లాంటి కీలక నటీనటులు మెరుగనున్నారు.

ఈ సినిమా ఈనెల 28న తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ ఓ మధ్య తరగతి అమ్మాయిగా కనిపించారు. కొన్ని అనివార్య పరిస్థితులలో తుపాకీ పట్టుకొని, పెను సవాళ్లను ఎదుర్కొంటారు. అలా కీర్తి సురేష్ ఎదుర్కొనే సమస్యలు చుట్టే ఈ కథ నడుస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ అద్భుతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూస్తే మనకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ నేపథ్యంలో సినిమా ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి.

Related News

తాజా వార్తలు