రామగిరి: (ప్రభాత జాగృతి): వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయడమే మన కర్తవ్యం అని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి వ్యాప్తంగా నవంబర్ 13 నుంచి 19వ తేది వరకు నిర్వహిస్తున్న బొగ్గు నాణ్యత వారోత్సవాలను గురువారం రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా జిఎం కార్యాలయ ఆవరణలో సింగరేణి నాణ్యత పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సింగరేణి సంస్థ ముద్రించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఉద్యోగులందరం కలిసికట్టుగా బొగ్గు నాణ్యత పెంపుదలకు కృషి చేస్తామని, తెలంగాణ రాష్ట్ర, దేశపురోభివృద్ధికి పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి సింగరేణియుడు తన వంతు కృషి చేయవలసిన అవసరం ఉందని వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయటం మన కర్తవ్యంగా భావించాలని అన్నారు.

