TG: మంథని నియోజకవర్గ పరిధిలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్మిత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగిరి సింగరేణి గెస్ట్ హౌస్ లో అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 7 వరకు మిషన్ భగీరథ సంబంధించి మంథని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు , పైప్ లైన్ పనులు, మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అడవి సోమనపల్లి యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని తెలిపారు. రామగిరి కేజీబీవీ కాంపౌండ్ వాల్, ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను, పీఎం శ్రీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ నిర్మాణం, హాస్టల్ భవన నిర్మాణ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు.

