రామగిరి: మండల కేంద్రమైన సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ సీనియర్ జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రతిభా కనబరిచిన మట్ట రమేష్, మచ్చ సహస్ర రాష్ట్రస్థాయికి ఎంపికైయ్యారు.
ఈనెల 7 తేదీన కొల్లాపూర్‌లో జరిగే సీనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ రవి,ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు రమేష్, సహస్రల రాష్ట్ర స్థాయి ఎంపిక పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

