TGL: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని, ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు.
సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా అందరూ కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. “అభ్యర్థి ఎంపిక ‘సెలెక్ట్ అండ్ ఎలెక్ట్’ పద్ధతిలో ఉంటుంది.ఎంపిక కాబడిన, ఏకఅభిప్రాయం వచ్చిన చోట నామినేషన్ వేయాలి. పార్టీలో ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉందని, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారని, దీనికి నిదర్శనం మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అని శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,నూతన రేషన్ కార్డుల పంపిణీ,రుణ మాఫీ అమలు. దేశంలో బడుగు బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.గత ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుండి వచ్చి పోటీ చేసిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేస్తూ, మనం ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటున్నాం, ప్రజల మద్దతు పొంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలి అని ఆయన కార్యకర్తలకు ఉద్బోధించారు.

