పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వర్గానికి పనిగంటలు పెంచే విధంగా, యాజమాన్యానికి, పెట్టుబడి దారులకు అనుకూలంగా తయారు చేసిన ఈ 4 కోడ్ లను వెంటనే రద్దు చేసి యధావిధిగా గతంలోని 29 చట్టాలను అమలు చేయాలని సింగరేణి ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం పై భగ్గు మన్న సింగరేణికార్మికులు కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మారుస్తూ శనివారం దేశవ్యాప్తంగా అమలులోకి తెస్తున్నట్లు ప్రకటన విడుదల చేయడం పట్ల గుర్తింపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాలను మారుస్తూ కార్మికులకు అందాల్సిన అలవెన్స్ లు, ప్లే డేలు, తదితర సౌకర్యాలను కాలరాస్తు పెట్టుబడిదారులకు అనుకూలంగా 12 గంటలకు పైగా పనిచేయాలని.. కార్మికుల మీద లేబర్ కోడ్ రూపంలో పని గంటల ఒత్తిడి తీసుకొస్తున్న బిజెపి ప్రభుత్వం తీరు పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కోడలు వ్యతిరేకంగా ఆర్జీత్రీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిఎం నరేంద్ర సుధాకర్ రావు కు వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో ఐక్య కార్మిక సంఘాలు టీబీజీకేఎస్, నాగేలిసాంబయ్య, ఏఐటీయూసీ, ఎం ఆర్ సి రెడ్డి, ఐ ఎన్ టి యు, కోట రవీందర్ రెడ్డి, సిఐటియు , కొమురయ్య, దేవ శ్రీనివాస్, శ్రీకాంత్ రావు, కేశవరావు, రవిశంకర్, వివి గౌడ్, పూర్ణాకర్, తిరుపతి, సురేష్, మల్లేష్, శ్రీనివాస్, సురేష్, శేఖర్ రెడ్డి, వేణుగోపాల్, రాఘవరెడ్డి,సందీప్,తదితరులతో పాటు ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

