కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామి ఇచ్చి పాత పద్దతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళుతున్నారని గంగిపెళ్లి అరుణ అన్నారు. జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగిపెళ్లి అరుణ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల సత్తా చాటుతమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జెనరల్ స్థానాలలో ఎస్సి ఎస్టీ బిసి మైనారిటీ లను మా పార్టీ నుండి నిలబెట్టి అగ్రవర్ణ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఒడిస్తామని తెలియజేశారు.
ఈ సమావేశానికి హాజరైన TRP రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీసీ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. బీసీలను వరుసగా మోసం చేస్తూ, బలహీనమైన జీవోలను విడుదల చేసిన రేవంత్ రెడ్డి, రెడ్డి ప్రభుత్వం ఢిల్లీలో ధర్నాలు అంటూ బీసీల సమయం వృథా చేస్తూ.. ఢిల్లీకి అఖిలపక్ష నాయకులను తీసుకుపోకుండా బీసీలకు రాజకీయ అవకాశాలు రాకుండ, లేకుండ చేస్తూ గతంలో ఉన్న 20శాతాన్ని కూడా 17కు కుదించిన కాంగ్రెస్ సర్కార్ కు బుద్ది చెప్పాలన్నారు. ఆ జీవోలను గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉండేలా చూసిన బీజేపీ పార్టీ ఆ రెండింటికి మద్దతుగా నిలిచి మౌనం పాటించిన BRS పార్టీలను రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడగోట్టాలని ఆయన అన్నాడు.
42శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన హామీల మాటలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయని, అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సమాజం తమ శక్తిని చూపించి, తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వాన్ని గెలిపించాలని అఖిల్ పాషా పిలుపునిచ్చారు. ఈ అగ్రవర్ణాల పార్టీలు ఏవి కూడ మా బడుగు బలహీన వర్గాలు రాజకీయం ఎదగడం ఓర్చుకోలేరు అని, చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వార వచ్చిన ఈ 42శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఈ జీవోలు ఏవి కుడా బిసిలకు పనిచేయవని అమలు నాడే శాసన మండలి సాక్షిగా, ప్రజాక్షేత్రంలో పలుమార్లు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బిసిలు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశ్రయించాలని అఖిల్ పాషా సూచన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగిపెళ్లి అరుణ, జిల్లా కార్యదర్శి చాంద్ పాషా, జిల్లా మహిళ అధ్యక్షులు విజయలక్ష్మి, టౌన్ ప్రెసిడెంట్ ఆర్షత్, ప్రధాన కార్యదర్శి ఎగుర్ల రమేష్, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీకాంత్, టీఆర్పీ నాయకులు వాజిత్,గంగిపెళ్లి సత్తిష్, జాబిర్ అలీ, ఇశ్రత్, అంకుష్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మహబూబ్, తదితరులు పాల్గొన్నారు.

