Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుమహిళలను మళ్లీ మోసం చేస్తున్న కాంగ్రెస్!

మహిళలను మళ్లీ మోసం చేస్తున్న కాంగ్రెస్!

బెజ్జంకి:గత ప్రభుత్వంలో 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అని చెప్పి మహిళను మోసం చేస్తూ తన దుర్బుద్ధుని మరోసారి బయటపెట్టిందనీ మాజీ జడ్పీటీసీ కనగండ్ల కవిత ఆరోపించారు.

మహిళలకు 2500 ఇస్తామని చెప్పి.. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు ఇలా మహిళాలను పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని మభ్యపెట్టి మళ్లీ మోసం చేయడానికి మరో కోణంలో ఈ ఇందిరమ్మ చీరలు మహిళా సంఘాలలో ఉండే సభ్యురాళ్లకే అని కాంగ్రెస్ మరో మారు ఆడపడుచులను మోసం చేస్తుందని మండిపడ్డారు.

మిగతా మహిళలకు ఓట్లు లేవా? 18 సంవత్సరాల నిండిన ఆడపిల్లలు మీకు ఓట్లు వేయరా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాన్ని మా ఆడపడుచులు గ్రహించాలని.. రాబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ జెడ్పిటిసి మండలంలోని మహిళలను కోరారు.

Related News

తాజా వార్తలు