Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుఅర్హులందరికీ ఇందిరమ్మ చీరలు అందిస్తాం:ఎమ్మెల్యే

అర్హులందరికీ ఇందిరమ్మ చీరలు అందిస్తాం:ఎమ్మెల్యే

వేములవాడ:అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. చందుర్తి మండల కేంద్రంతోపాటు మల్యాల గ్రామంలో మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

Related News

తాజా వార్తలు