Wednesday, July 22, 2026
Homeవార్తలుపలు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వంశి కృష్ణ

పలు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వంశి కృష్ణ

TG:జగిత్యాల జిల్లా తాటిపర్తిలో ఇటీవల అనారోగ్యంతో ఉన్న తాటిపర్తి కరుణాకర్ రెడ్డిని, (మాజీ MLC జీవన్ రెడ్డి సోదరుడు) పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశి కృష్ణ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వివరంగా తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎంపీ.. “కరుణాకర్ రెడ్డి కుటుంబానికి, ప్రాంతానికి మంచి సేవ చేసిన వ్యక్తి. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ధర్మారం గ్రామ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారా ప్రభాకర్ కుటుంబ సభ్యులను ఎంపీ వంశీకృష్ణ ఓదార్చారు.ప్రభాకర్ ప్రజలకు సేవ చేసిన మంచి నాయకుడని ఆయన మరణం తీరనిలోటని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.

కమాన్ పూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కుందారపు రాజ్ కుమార్ (రోహిత్) కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు. ఆయన వెంట మాదాసు విజయ్, అఖిల్, గన్నవరం రవి, మూర్తి, మహేష్, సల్లావుద్దీన్ తదితరులు ఉన్నారు.

Related News

తాజా వార్తలు