రామగుండం మున్సిపల్ పరిధిలో బయో–మెడికల్ వ్యర్థాల సక్రమ నిర్వహణపై నేడు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మున్సిపల్ కమిషనర్ రామగుండం జె.అరుణ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, డెంటల్ క్లినిక్స్, స్కాన్ సెంటర్ల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
జె.అరుణ శ్రీ, అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ వ్యర్థాలతో బయోమెడికల్ వ్యర్థాలను కలిపి పారవేసిన ఏ ఆసుపత్రిపైనా కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని స్పష్టం చేశారు.దీని వల్ల మున్సిపల్ కార్మికులు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉందని అలాగే ఇది పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.అన్ని ఆసుపత్రులు అధీకృత బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలతో తప్పనిసరిగా టై-అప్ చేసుకోవాలని, మున్సిపల్‌కు ఇస్తున్న వ్యర్థాలలో బయోమెడికల్ వ్యర్థాలు కనిపిస్తే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టం–2016, మున్సిపల్ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–2010 ప్రకారం జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డాక్టర్ వి.వాణిశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, క్లినిక్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి NOC తప్పనిసరిగా కలిగి ఉండాలని, అలాగే గుర్తింపు పొందిన బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో టై-అప్ పొందాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్ మేరకు బయోమెడికల్ వేస్ట్‌ను సోర్స్ వద్దనే (OT,వార్డు,లేబర్ రూమ్, ఇంజెక్షన్ రూమ్,ల్యాబ్‌లు) కలర్ కోడ్ బిన్స్‌లో వేరు చేయాలని తెలిపారు.సెగ్రిగేషన్ సరిగా చేయకపోతే ఏజెన్సీలు వ్యర్థాలను తీసుకునేందుకు నిరాకరించే అవకాశం ఉందని, అప్పుడు అవి మున్సిపల్ వేస్టేజ్‌తో కలుపబడే ప్రమాదం ఉందని చెప్పారు. అలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
ఏజెన్సీ వాహనం రాకపోయినా,టై-అప్ రిన్యువల్ చేసు కోక పోయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచారం అందిస్తే,బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు తెలిపారు. ఆరోగ్య శాఖకు తెలియ జేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-2010 ప్రకారం చర్యలు తీసుకుంటామని అని అన్నారు.ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లు మరియు ఐ.ఎం.ఎ.సభ్యులు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపాలిటీ సీనియర్ అదనపు &డిప్యూటీ కమిషనర్లు, డా. కృపాబాయి (ఆర్.ఎం.ఓ., ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి,రామగుండం), బయోమెడికల్ వేస్ట్ ఏజెన్సీ ప్రతినిధి సతీశ్, ఐ.ఎం.ఎ.అధ్యక్షులు క్యాసాని శ్రీనివాస్, డాక్టర్లు లక్ష్మీవేణి, డా.రాపోలు వనజ, డా. దామెర అనీల్ కుమార్, ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

