Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుఅద్వాన్నంగా రోడ్లు.. బీఆర్ఎస్ భారీ ధర్నా

అద్వాన్నంగా రోడ్లు.. బీఆర్ఎస్ భారీ ధర్నా


మానకొండూర్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులు అద్వాన్నంగా మారాయని, గుంతల రోడ్డుతో ప్రజలు అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వెంటనే రోడ్ నిర్మాణ పనులను చేపట్టాలని మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపెళ్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పాల్గొని మాట్లాడుతూ.. “రహదారుల దుస్థితి వల్ల విద్యార్థులు, రైతులు, రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , రెండు ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఈ సమస్యలు కనిపించడం లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గుంతల రోడ్లతో అవస్తలు పడుతోన్న స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కనీసం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వెంటనే నిధులు కేటాయించి రహదారులను పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు గడ్డం నాగరాజు,రామంచ గోపాల్ రెడ్డి,దేవ సతీష్ రెడ్డి,పిట్టల మధు,పారునంది కిషన్,ముద్దసాను శ్రీధర్,పున్నం మల్లయ్య,పడాల సతీష్ గౌడ్,ఎరుకల శ్రీనివాస్,చాతరాజు యాదగిరి,నెల్లి శంకర్,రాచకట్ల వెంకటస్వామి,నెల్లి మురళి,గడ్డం సంపత్,పిండి సందీప్,పున్నం మహేష్,పిట్టల నరేష్,బుర్ర శ్రీనివాస్,ఉదయ్,ఉండింటి అనిల్ తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు