Wednesday, July 22, 2026
Homeరాజకీయాలుమహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి: సీఎం రేవంత్ రెడ్డి

TG:ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమం పైన..సచివాలయం నుండి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ని ర్వహించగా..ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించుకు న్నామన్నారు. ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజక వర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. ఒక పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు.మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టండన్నారు.మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాదు.. వాటికి మహిళలను యజమానులను చేశామన్నారు. స్కూల్స్‌లో యూనిఫారం కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామన్నారు.

ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం ఆన్ లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నాం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కోటి మంది మహిళలలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందన్నారు.మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందన్నారు. కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ మహిళా శక్తి కి నిదర్శనమని తెలిపారు. ఇందిరమ్మ పేరుతో రాష్ట్రం లోని మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చేపట్టారని పేర్కొన్నారు. మహిళా సమాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. ఆకాశమే హద్దుగా మహిళలు ఎదగడానికి మహిళలకు ఆకాశం రంగును సూచించే విధంగా నీలం రంగు చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

చీరల పంపిణీని సమాఖ్య సభ్యులు పర్యవేక్షించాలి: కలెక్టర్ పమేలా సత్పతి
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులందరికీ చీరలు అందేలా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మాట్లాడుతూ.. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు ప్రతి ఒక్కరికి చేరేలా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పర్యవేక్షించాలని అన్నారు. ఓపెన్ స్కూల్, వయోజనుల విద్య నమోదులో జిల్లా లక్ష్యాన్ని పూర్తి చేసిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఓపెన్ 10వ తరగతి, ఇంటర్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరంతా తరగతులకు కూడా హాజరు కావాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో ప్రతి మూడవ శనివారం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి తల్లిదండ్రులు కచ్చితంగా హాజరయ్యేలా సమాఖ్య సభ్యులు చూడాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన వివిధ యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు కృషి పట్టుదలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లాభాలు గడించాలని తెలిపారు. బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు, రికవరీలో జిల్లా నెంబర్ వన్ స్థానంలో నిలవడం గొప్ప విషయమని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న సంఘాలు మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు.

Related News

తాజా వార్తలు