Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుకేంద్ర మంత్రికి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ లేఖ

కేంద్ర మంత్రికి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ లేఖ

TG:పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లినట్లు, 2025–26 పత్తి కొనుగోలు సీజన్ నేపథ్యంలో, కేంద్ర టెక్స్టైల్స్ యూనియన్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు ఎంపీ వంశీ కృష్ణ పలు కీలక సూచనల తో లేక పంపినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

సీసీఐ ప్రతిపాదించినట్టు రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడం తప్పు నిర్ణయం అని ఎంపీ పేర్కొన్నారు. ఈ అంచనా రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టర్లు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమర్పించిన ధృవీకరించిన డేటాకి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 6,680 ఎంఎంటిలు పత్తి కొనుగోలు కాగా, 3,175 మంది రైతులు లబ్ధి పొందారు. పత్తి కొనుగోలు మొత్తం విలువ ₹52.25 కోట్లు, అందులో ₹15.04 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమయ్యాయి.ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని, దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని ఎంపీ వంశీ కృష్ణ కోరారు.

అదేవిధంగా, పత్తి మిల్లర్లు & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ mnసూచించిన మాయిశ్చర్ నార్మ్స్, L1/L2 విభజన సమస్య, స్లాట్ బుకింగ్ కష్టాలు, జిన్నింగ్ మిల్లుల కార్యకలాపాల సమస్యలు వంటి అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సానుకూల చర్యలను ఎంపీ ప్రశంసించారు. టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్, 176 మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు, సీసీఐతో కలిసి జిన్నింగ్ మిల్లుల మ్యాపింగ్, అవగాహన కార్యక్రమాలు రైతులకు మేలు చేస్తాయని తెలిపారు.

ఎంపీ వంశీ కృష్ణ ప్రధాన డిమాండ్లు:
-రాష్ట్ర సగటు పత్తి దిగుబడి 11.74 క్వింటాళ్లుగా కొనసాగించాలి
-మాయిశ్చర్ పరిమితిని 20% వరకు సడలించాలి
-మిల్లర్లు & ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఈ చర్యలతోనే రైతులకు న్యాయమైన ధరలు, సాఫీ కొనుగోలు ప్రక్రియ సాధ్యమవుతుందని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ స్పష్టం చేశారు.

Related News

తాజా వార్తలు