Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుఆదివాసి ప్రాంతాల అభివృద్దే.. దేశ అభివృద్ధి:మధుయాష్కి గౌడ్

ఆదివాసి ప్రాంతాల అభివృద్దే.. దేశ అభివృద్ధి:మధుయాష్కి గౌడ్

HYD: రాజ్‌భవన్‌లో మంగళవారం జరిగిన గిరిజన యువతతో ఇంట్రాక్షన్ (వాలిడిక్టరీ) కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో 17వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా వారం రోజులపాటు నగరంలో జరిగిన గిరిజన యువత సమ్మేళనంలో చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన చెందిన యువతీ యువకులు పాల్గొన్నారు. చివరి రోజు అయిన సోమవారం ఉదయం గవర్నర్ కార్యాలయాన్ని సందర్శించారు. వారం రోజులపాటు తాము తెలుసుకున్న అంశాలను, నూతన ఆవిష్కరణలకు సంబంధించి మధ్య జరిగిన చర్చలను గవర్నర్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమాత్రను గవర్నర్, మధుయాష్కీ కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ గిరిజన ఆదివాసి ప్రాంతాలలో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, తాగునీరు లాంటి కనీస సదుపాయాలు లేకపోవడం బాధాకరమన్నారు. సామాజిక ఆర్థిక అణిచివేత కారణంగా చాలామంది యువత నక్సలిజం వైపు వెళ్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గిరిజన ప్రాంతాలలో అనేక వనరులు ఉన్నాయని, కానీ వారికి సరైన సదుపాయాలు, సంపదలో వాటా దక్కకపోవడం బాధాకరమన్నారు.

అధికారంలో ఎవరున్నా ఆదివాసి యువత తమ హక్కుల కోసం, తమ శ్రమకు తగ్గట్టు ఫలితం కోసం ప్రశ్నిస్తునే ఉండాలని సూచించారు. ఆదివాసి యువతకు ఉపాధి, ఉద్యోగాలు, అన్ని రంగాలలో అవకాశాలు కల్పించినప్పుడే వారి అభ్యున్నతికి దోహదం చేసిన వారమవుతామన్నారు. ఆదివాసి గిరిజన యువత ఉన్నత స్థానాలకు ఎదిగి తాము పుట్టి పెరిగిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం పర్యటనలో భాగంగా నేర్చుకున్న అంశాలను యువత ఈ సందర్భంగా వివరించారు.

Related News

తాజా వార్తలు