Wednesday, July 22, 2026
Homeవార్తలు"ప్రజావాణి"కి దరఖాస్తుల వెల్లువ

“ప్రజావాణి”కి దరఖాస్తుల వెల్లువ

కరీంనగర్:ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. 288 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు