స్థానిక ఎన్నికల వేల పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం సీత్య తండాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. గ్రామానికి చెందిన 25 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరికల కార్యక్రమం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
గ్రామంలో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు అవకాశాల కల్పన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి తమను ఆకట్టుకుందని, అందుకే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరామని కార్యకర్తలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. సీత్య తండా నుంచి 25 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకున్నారనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేద్దామని, సీత్య తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సీత్య తండాలో జరిగిన చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. స్థానిక ఎన్నికల సందర్భంలో ఇది కీలక మలుపు అని, తమ పార్టీ గ్రామంలో మరింత బలం పుంజుకున్నదని చెప్పారు.

