HYD:ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 3 తేదీన బోయినిపల్లిలోని ఆయన స్వగృహంలో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మొదట ఉదయం గణపతి పూజ, అతర్వాత సాయంత్రం ఆరు గంటలకు మహా పడి పూజా కార్యక్రమాన్ని తలపెట్టారు.
ఈ వేడుకలకు పెద్ద పులి ఈశ్వర్ స్వామి బృందంచే ప్రత్యేక భజన, కచేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఆర్.శివకార్తీక శాస్త్రి గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం చేస్తున్నట్లు వివరించారు.ఈ వేడుకల్లో ముద్దం నర్సింహా యాదవ్ కుటుంబ సభ్యులు, చందు యాదవ్,మల్లేష్ యాదవ్,అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి మహా పడి పూజాలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమంలో స్థానికులు,అయ్యప్ప స్వాములు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికలు తదితరులు పాల్గొననున్నారు.

