Tuesday, July 21, 2026
Homeవార్తలుశిశుగృహ, బాలసదనం నుండి పిల్లల దత్తత

శిశుగృహ, బాలసదనం నుండి పిల్లల దత్తత

TG: కరీంనగర్‌ శిశు గృహలో పెరుగుతున్న నాలుగు నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్ కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13 సంవత్సరాల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.

జిల్లా యువజన క్రీడా శాఖ కార్యాలయంలో జరిగిన ఈ దత్తత కార్యక్రమం సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. అనాథ శిశువుల దత్తత, రక్త సంబంధీకుల నుండి దత్తత తీసుకోవాలనుకునే వారు కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, డి సి పి ఓ పర్వీన్, ప్రొటెక్షన్ ఆఫీసర్ తిరుపతి, శిశు గృహ మేనేజర్ తేజస్వి, సాదినేని రమేష్ పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు