కరీంనగర్: జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మహిళ ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. సుమారు 50 వేల రూపాయలు విలువచేసే 45 రకాల పరీక్షలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఈ పరీక్షలు చేస్తారని తెలిపారు. ప్రత్యేక క్యాంపుల ద్వారా కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే టీఎన్జీవో భవన్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతాయని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా టీఎన్జీవో భవన్లో 300 మంది అంగన్వాడీ సిబ్బంది సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందజేసినట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బందితోపాటు అపోలో రీచ్, వాసన్ ఐ కేర్ ఆస్పత్రి వైద్యులు ఈ సేవలో పాల్గొన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సనా, ఉమా శ్రీ, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగేం లక్షణ్ రావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా సహాధ్యక్షులు ఒంటెల రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, మహిళా జేఏసీ నాయకులు ఇరుమల్ల శారద, సునీత, సరిత, విజయలక్ష్మి, లలితమేరీ, రమణ, స్వరూపా, లక్ష్మీ బాగ్యలక్శి ఉర్మీళ అస్గర్ అలీ గోవిందాపతి శ్రీనివాస్ వాస్తవి గౌడ్ కోమ్మెర శ్రీనివాస్ రెడ్డి లవ కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

