Tuesday, July 21, 2026
Homeవార్తలుహలో మాల ఛలో ఢిల్లీకి తరలిన ఉమ్మడి కరీంనగర్ నాయకులు

హలో మాల ఛలో ఢిల్లీకి తరలిన ఉమ్మడి కరీంనగర్ నాయకులు

కరీంనగర్:మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ 26న చేపట్టిన హలో మాల ఛలో ఢిల్లీ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాల మహానాడు నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ.. మాలలపై జరుగుతున్న అక్రమాలను నిలదీస్తూ ,రాజ్యాంగ విరుద్ధంగా జీవో 99 రోస్టర్ విధానాన్ని తిరిగి పునః సమీక్షించాలని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ 15 నుంచి 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ, నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, భారత కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ చిత్రం ముద్రించాలని పేర్కొన్నారు.

అలాగే దేశంలో ఎస్సీ, ఎస్టీల పై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో 41 సిఆర్పి సెక్షన్ ద్వారా నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకుండా పోతుందని, వెంటనే 41 సిఆర్పి సెక్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

12 అంశాలతో కూడిన డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరారు.ఇందులో జాతీయ మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నె రాజు, కరీంనగర్ జిల్లా అధ్యక్షు ‌ కాడె శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక ఆంజనేయులు, ‌చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కునమల్ల చంద్రయ్య, మానకొండూర్ ఇంచార్జ్ లింగం కుమార్, హుజూరాబాద్ ఇంచార్జ్ జిల్లా జూపాక శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ ఇరుకుల యాదగిరి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, చొప్పదండి టౌన్ ప్రెసిడెంట్ సంబోజి సునీల్, వైస్ ప్రెసిడెంట్ కనుమల్ల చందు గుంటపల్లి రవీందర్,తాళ్ల అంజయ్య సురేష్,దిలీప్, ప్రవీణ్,న్యాత రాజేందర్, యాలాల రమేష్,లింగం కుమార్, దొంత కనకయ్య ,సుంకె కిరణ్,కర్ర మణికంఠ,రొడ్డా మహేష్ ,రొడ్డా చంద్రశేఖర్,మాషం అనిల్, ఎలుక ప్రేమ్ చంద్,రోడ్డ అశ్రిత్ గాజుల ధర్మేందర్, మల్లం అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు