పెద్దపల్లి:నవంబర్ 25న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళా సంఘాలకు వడ్డి లేని రుణాల పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంత్రి భట్టి విక్రమార్క మల్లు సోమవారం హైదరాబాద్ నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డి లేని రుణాలపై సీఎస్ కే.రామ కృష్ణా రావు,ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ చీరల నాణ్యత పట్ల మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ చీరలు చేరే విధంగా సమన్వయంతో పనిచేసిన కలెక్టర్లు, ఇతర సిబ్బందికి డిప్యూటీ సీఎం అభినందనలు తెలియజేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు మహిళలకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రంగా మరో విడత వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం నవంబర్ 25న చేపట్టాలని, శాసనసభ్యులకు కలెక్టర్లు వెంటనే సమాచారం అందించాలని అన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే వడ్డే లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి మండల మహిళా సమాఖ్యలను, గ్రామ మహిళా సమాఖ్యలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని అన్నారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించిన 304 కోట్ల నిధులు ఈరోజు విడుదల చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.
వడ్డి లేని రుణాల పంపిణీ కార్యక్రమం పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలు స్థానిక ప్రజా ప్రతినిధులకు అందించాలని అన్నారు.
సీఎస్ కే.రామకృష్ణా రావు మాట్లాడుతూ.. 3వ విడత క్రింద మహిళా సంఘాలకు 304 కోట్ల పైగా నిధులు వడ్డీ లేని రుణాల కింద విడుదల చేయడం జరుగుతుందని, వీటిని జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ పంపిణీ చేయాలని అన్నారు. వడ్డీ లేని కార్యక్రమం పకడ్బందీగా అమలు అవుతుంది అనే సందేశం మహిళలకు వెళ్ళేలా రేపటి కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.
వడ్డీలేని రుణాల కార్యక్రమంలో భాగంగా వడ్డీ డబ్బులు ప్రభుత్వం జమ చేసినట్లు మహిళా సంఘాల్లోని సభ్యులందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లో ఒక్కోచోట వడ్డీ సోమ్ము పంపిణీ పాల్గొనేలా చూడాలని అన్నారు.
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 9,10వ తరగతి విద్యార్థులకు అందించడం జరుగుతుందని, దీనికి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా కలెక్టర్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించి పంపిణీ చేయకుండా పెండింగ్ ఉన్న 57 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సంబంధించి పీఎంఏవై అర్భన్ నుంచి నిధులు 3వ విడత రాబట్టుకోవాల్సి ఉందని అన్నారు.
కేంద్రం నుంచి నిధులు రావాలంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులకు పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. లబ్దిదారుల ఎంపిక ఆలస్యం జరిగితే కేంద్ర నిధులు కోల్పోయే ప్రమాధం ఉన్నందున కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటి స్థలం లేని నిరు పేదల నుంచి అర్హులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాలిందిని, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

