కరీంనగర్:గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి రంగనాయకుల స్వామి ఆలయంలో ఈనెల 29న శనివారం ఉదయం 11 గంటలకు గుండ్లపల్లి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో మహాపడిపూజ నిర్వహిస్తున్నట్టు గురుస్వామి దొమ్మాట భాస్కర్ రెడ్డి తెలిపారు.
మహా పడిపూజకు బెజ్జంకి, ఇల్లంతకుంట, తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లోని అన్ని గ్రామాల అయ్యప్ప స్వాములు, వివిధ గ్రామాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పడిపూజ లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దొమ్మాట భాస్కర్ రెడ్డి గురు స్వామి, మాజీ సర్పంచ్ బేతల్లి రాజేందర్ రెడ్డి స్వాములు కోరారు.

