Tuesday, July 21, 2026
Homeవార్తలువారి కోసమే యువజన ఉత్సవాలు: కలెక్టర్ పమేలా

వారి కోసమే యువజన ఉత్సవాలు: కలెక్టర్ పమేలా

కరీంనగర్: యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు. యువజన సాంస్కృతిక పోటీలు, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ ఉంటుందని, దానిని బయట తీయటానికి యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువత తలుచుకుంటే సాధించని ఏమీ లేదని అన్నారు. యువత చెడు మార్గంలో పయనించకుండా సన్మార్గంలో పయనించాలని అన్నారు.

యువత సామాజిక సేవను అలవర్చుకొని ముందుకు సాగాలని అన్నారు.సామాజిక సేవలో కృషి చేసిన యువజన స్వచ్ఛంద సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు.యువజన ఉత్సవాల్లో ప్రతిభ కనబరిచిన వారికి మెమొంటోను,సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ పొందిన విద్యార్థులకి సర్టిఫికెట్స్ అందజేశారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. సైన్స్ మేళా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా యువజన,క్రీడ శాఖాధికారి వి.శ్రీనివాస్ గౌడ్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు,బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్,జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి,జాతీయ యువజన అవార్డు గ్రహీత రెండ్ల కళింగ శేఖర్,రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్తినేనీ శ్రీనివాస్,జిల్లా యువజన అవార్డు గ్రహీత బంధారపు అజయ్ కుమార్,యోగా అసోసియేష్ అధ్యక్షులు సిద్ధారెడ్డి,బాల భవన్ సూపర్ డెంట్ మంజులవాని,గందెకల్పన,కర్రే పావని,యువజన ప్రతినిధులు తోర్తి శ్రీనివాస్,బోనాల సంపత్,రెండ్ల అంజి,గంగిపల్లి సతీష్, కిష్టయ్య,మల్లికా,సుజాత,పలు యువజన మహిళా సంఘాల సభ్యులు, యువతి, యువకులు, విద్యార్థులు,పాల్గొన్నారు. సాంస్కృతిక సారధి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి.

జిల్లా స్థాయి యువజనోత్సవాళ్ళో గెలుపొందిన వారి వివరాలు:

జానపద నృత్యం గౌతమి గ్రూప్(లంబాడీ డాన్స్), జానపద గేయం:నక్క శివరాం గ్రూప్, కథ రచన:మౌనిక, పెయింటింగ్:పాయల్, ఉపన్యాసం:వైశాలి, కవిత్వం:నళిని, సైన్స్ మేలా:అక్షయ ,అమూల్య. ప్రతిభ కనబరిచిన ఈ కళాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

Related News

తాజా వార్తలు