Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుబీజేపీ జెండా ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

బీజేపీ జెండా ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

మహబూబ్‌నగర్‌: ఉప్పునుంతల మండలం ఆవులోని భావి గ్రామంలో బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు మధ్యాహ్నం జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆవులోని భావి గ్రామ బిజెపి నాయకులు మదునాగుల మహేందర్ పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో కాషాయం జండా ఎగరడం లక్ష్యంగా గువ్వల బాలరాజు ముందుకు సాగుతున్నారని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని పార్టీ శ్రేణులకు మహేందర్ పిలుపునిచ్చారు.

Related News

తాజా వార్తలు